ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

Feb 15,2024 13:22 #Nara Lokesh, #TDP, #vijayanagaram
  • దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ
  • రాజాంలోశంఖారావం సభ

ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, టిటిడి మాజీ చైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి ఆ ముగ్గురేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు.. ఈ మేరకు గురువారం రాజాం మండల కేంద్రం పాలకొండ రోడ్‌లో ఏర్పాటు చేసిన శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో లోకేష్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు చీడపురుగులు , దరిద్రులని ఈ ముగ్గురేనని వీరికి తోడుగా జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అని వెల్లడించారు.. ప్రజలు వీరిని నమ్మద్దని అన్నారు. జగన్‌ ఓ 420 అని , ప్రజల సొమ్ముతో 150 కోట్లు జీతం తీసుకున్న సలహాదారుడు సజ్జల రామకృష్ణారావు 840 అని విమర్శించారు. వీరంతా బూమ్‌ బామ్‌.. ప్రెసిడెంట్‌ మెడల్స్‌ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు కార్యకర్తలలు లేరని, అదే టిడిపికైతే 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని వెల్లడించారు.. 2019లో రాజాం నియోజకవర్గంలో ఇసుక దోపిడీలో కీలక పాత్ర వహించి, లక్షల కోట్లు ఇసుక దోపిడీ చేసిన ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, జిల్లా చైర్మన్‌ మజ్జి చిన్న శ్రీనేనని దుయ్య బట్టారు. వైసిపి చిల్లర కేసులకు తగ్గేదేలే అని అన్నారు.. వైసిపి దొంగ ఓట్లు, డబ్బుతో గెలవాలని చూస్తుందని ప్రజలు గమనించి ఎదురుతిరగాలన్నారు. సైకో జగన్‌ను డేరాల్లో తిరిగిన వ్యక్తిఅని, నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తినని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఒక వింత క్యాబినెట్‌ ఉందని, తెల్లవారితే వారి శాఖల తెలియని మంత్రులు ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు. సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్రానికి న్యాయం ఎలా చేయగలరని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్‌ బుకే సమాధానం చెబుతుందన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తి నేనుని, జగన్‌ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని మా ఇద్దరికీ తేడా ఇదేనని అన్నారు. రెండు నెలలు ఓపిక పడితే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు కల్పించి, ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భతి కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏడాదికి 15000 వంతున ఇస్తామన్నారు… ప్రతి రైతుకి 20,000 అందజేస్తామన్నారు.. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా అందజేస్తామన్నారు… 18 నుంచి 59 యాల లోపు ప్రతి మహిళకు ప్రతి నెల 1500 అందజేస్తామన్నారు. మహిళకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు…. టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు నాగార్జున మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా ఒక మూరు?డు పాలనలో రాష్ట్రప్రజలు నానా అవస్థలు పడుతున్నారు…సంక్షేమం మాటును పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు..టిడిపికి చెందిన సీనియర్‌ నాయకులు అచ్చెన్న, కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర వంటి బిసి నాయకులపై తప్పుడు కేసులు బనాయించారని. జగన్‌ కు బుద్ధిచెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.. మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అవినీతి తిమింగళం, ఓక్స్‌ వ్యాగన్‌ వెళ్లిపోవడానికి బొత్స కారణం కాదా..మున్సిపల్‌ మంత్రిగా ఉన్నపుడు ఆయన రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివద్ధి శూన్యమని తెలిపారు..మంత్రి బొత్స నేతత్వంలో విద్యాశాఖలో కూడా అవినీతి రాజ్యమేలుతోందని, విద్యార్థులకు నాసిరకం కిట్లు ఇస్తున్నారని విమర్శించారు. టీచర్ల బదిలీల్లో సైతం నిబంధనలను ఉల్లంఘించి భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారని అన్నారు.మనకు ఒక రాజధాని ఉండాలన్నా, అభివద్ధి జరగాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. పాలకొండ-రాజాం మధ్య రహదారిని రాష్ట్రంలో ఎక్కడాలేనంత చెత్తగా తయారు చేశారన్నారు… 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తప్పదని, మీరంతా టిడిపిని బలోపేతం చేసి 175కు 175 గెలిచేలా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. రాజాం నియోజకవర్గం ఇంచార్జి కొండ్రు మురళీమోహన్‌, జనసేన రాజాం నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ని రాజు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో రేగిడి, సంతకవిటి ,వంగర, రాజాం మండలాల నుండి చంద్రమౌళి కొల్ల అప్పలనాయుడు, బొత్స వాసునాయుడు, పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ుు—దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోంది : నారా లోకేష్‌ప్రజాశక్తి- రాజాం: రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ఓ 420 అలానే సజ్జల 840 అని అని మండిపడ్డారు. ఇక 420 జగన్‌ కి 840 సజ్జల రామకష్ణారెడ్డి సలహాదారుడని.. ఆయన సలహా మేరకు వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెలేల్సి ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను టీడీపీ గెలిచిందని.. ఆ సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అసలు వీళ్ళు మా ఓటర్లే కాదన్నారని.. అయితే ఆ సమయంలో ఆయనలా ఎందుకన్నారో అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతుందని.. దొంగ ఓట్లు ఎక్కించి రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.

➡️