Rajamouli : రాజమౌళి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Apr 1,2024 16:05 #Dance, #movie, #rajamouli, #Viral Video

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ విజయం సాధించినవే. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఏకైక డైరెక్టర్‌ రాజమౌళి అనే చెప్పాలి. రాజమౌళి పైకి ఎలాంటి హడావిడి చేయకుండా.. చాలా కూల్‌గా సౌమ్యంగా కనిపాస్తాడు. అలాంటిది తాజాగా జక్కన్న ఓ ఫంక్షన్‌లో తన భార్య రమా రాజమౌళితో కలిసి ‘ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ అనే పాటకు ఆశ్చర్యపోయేలా డ్యాన్స్‌ చేశాడు. తాజాగా ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జక్కన్న టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు. కాగా, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెఎల్‌ నారాయణ నిర్మించనున్నారు.

➡️