పూనె : సునీల్ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పూనె కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే శుక్రవారం పూనెలోని సాసూన్ జనరల్ హాస్పిటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఈయనతోపాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఈ వీడియోలో… సునీల్ కాంబ్లే మెట్లపై నుంచి దిగుతూ ఉండగా.. పక్కనే ఉన్న వ్యక్తి చెంపపై కొట్టడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి బండ్గార్డెన్ పోలీస్ స్టేషన్కి అనుబంధంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అని అధికారులు వెల్లడించారు. అయితే సునీల్ కాంబ్లే ఈ ఘటనను ఖండించారు. ‘నేను ఎవరిపైనా దాడి చేయలేదు. నేను మెట్లు దిగి వస్తున్నప్పుడు ఎవరో అడ్డంగా వచ్చినప్పుడు నేను అతనిని తోసుకుని ముందుకు వెళ్లాను’ అని కాంబ్లే చెప్పారు. ఇక ఈ ఘటనపై కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంబ్లేపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 (ప్రభుత్వ సేవకుడిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) కింద కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
#WATCH | Maharashtra | BJP MLA Sunil Kamble was seen slapping a Police personnel during an event at Sassoon Hospital in Pune today. Deputy CM Ajit Pawar was present on the stage at the event when the incident occurred.
Visuals show Sunil Kamble leaving the stage after the… pic.twitter.com/gSXTRmINMr
— ANI (@ANI) January 5, 2024