బిక్షాటన చేపట్టిన అంగన్వాడి వర్కర్ లు

Dec 20,2023 14:46 #Konaseema
konaseema anganwadi workers strike on 9th day

ప్రజాశక్తి – రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం కొనసాగుతున్న నిరవధికసమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. తొమ్మిదో రోజు అంగన్వాడీ కార్యకర్తలంతా రామచంద్రపురం పట్టణంలోని మెయిన్ రోడ్ లో భిక్షాటన గావించారు. కొట్టు కొట్టుకు వెళ్లి రెండు నెలలుగా జీతాలు లేవని తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమకు ఆర్థిక సహాయం చేయాలని షాపు షాపుకు వెళ్లి బిక్షాటన గావించారు. పలువురు వ్యాపారులు బాటసారి వాహనదారులు అంగన్వాడి వర్కర్లకు చిల్లర నోట్లు దానం చేశారు. ప్రభుత్వం మండు వైఖరి విడనాడాలని, అంగన్వాడి వర్కర్లు జీతాలు పెంచాలని, న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు నూకల బలరాం, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, అంగన్వాడి యూనియన్ నాయకులు ఎం.దుర్గ తదితరులు ప్రసంగించారు. ఇక గ్రామాల్లో తొమ్మిది రోజులుగా అంగన్వాడీ సెంటర్లు తాళాలు వేసి ఉండటంతో వెల వెల పోతున్నాయి. చిన్నారులకు అందించాల్సిన పోషకాహారం పాలు తదితర అంశాలన్నీ ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.

➡️