యూకో బ్యాంక్‌ ఐఎంపిఎస్‌ స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరం

Mar 7,2024 21:35 #Business

న్యూఢిల్లీ : యూకో బ్యాంక్‌లో జరిగిన ఐఎంపిఎస్‌ భారీ మోసంపై సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది. రాజస్థాన్‌, మహారాష్ట్రలోని 67 చోట్ల సోదాలు చేసింది. గతేడాది నవంబర్‌ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదారుల ఖాతాల్లో అనుహ్యాంగా నగదు జమ అయిన విషయం తెలిసిందే. అదే నెలలో 21న సిబిఐ కేసు నమోదు చేయగా. తాజాగా విచారణను వేగవంతం చేసింది. ఏడు ప్రయివేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపిఎస్‌ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41వేల ఖాతాదారులకు తప్పుగా మళ్లించినట్లు సిబిఐ ప్రాథమికంగా గుర్తించింది. ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి నగదు కట్‌ అవకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల ఖాతాల్లో నగదు జమ కావడంపై సిబిఐ విచారిస్తోంది.

➡️