జిడిపి స్థిర ఏడాది మార్పు..!

Jun 29,2024 21:24 #Business

న్యూఢిల్లీ : స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) స్థిర ఏడాది మార్పునకు 26 మందితో కూడిన అడ్వైజరీ కమిటీ ఆన్‌ నేషనల్‌ ఎకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌ (ఎసిఎన్‌ఎఎస్‌)ను ఏర్పాటు చేస్తూ కేంద్ర గణాంకాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఛైర్మన్‌గా ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ ఎకానమిక్‌ గ్రోత్‌ మాజీ ప్రొఫెసర్‌ బిస్వంత్‌ గొల్డర్‌ను నియమించింది. సభ్యుల్లో సిఎస్‌ఒ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ జిసి మన్న, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ మౌసమి దాస్‌, ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ డైరెక్టర్‌ చేతన్‌ ఘాటే ఉన్నారు. అదే విధంగా ఆర్‌బిఐ, నీతి అయోగ్‌, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, జిఎస్‌టి నెట్‌వర్క్‌, వాణిజ్య మంత్రిత్వ శాఖల నుంచి ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జిడిపి నూతన స్థిర ఏడాది కోసం ఏర్పాటు చేసిన కమిటీ కాలపరిమితి ఐదేళ్లు లేదా తదుపరి స్థిర ఏడాది పూర్తి అయ్యే వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం 2011-12 స్థిర ధరల వద్ద జిడిపిని లెక్కిస్తున్నారు.

➡️