మూడో వారంలోనూ మారకం నిల్వలు పతనం

May 3,2024 21:36 #Business, #RBI

న్యూఢిల్లీ : వరుసగా మూడో వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. ఏప్రిల్‌ 26తో ముగిసిన వారంలో 2.4 బిలియన్‌ డాలర్లు క్షీణించి 637.9 బిలియన్లుగా నమోదయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం తన రిపోర్ట్‌లో తెలిపింది. అదే విధంగా ఐఎంఎఫ్‌ వద్ద భారత మారకం నిల్వలు కూడా 8 మిలియన్‌ డాలర్లు కరిగి 4.639 బిలియన్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు 2.28 బిలియన్‌ కరిగిపోయి 640.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 1.275 బిలియన్‌ డాలర్లు తగ్గి 55.533 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బిఐ తెలిపింది.

➡️