భౌగోళిక ఉద్రిక్తతలతో ఎగుమతులపై ఒత్తిడి : ఎఫ్‌ఐఇఒ

Apr 30,2024 21:39 #Business

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పలు ఉద్రిక్త పరిస్థితులు భారత ఎగుమతులపై ప్రభావం చూపనున్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఇఒ) డైరెక్టర్‌ జనరల్‌ అజరు సహారు పేర్కొన్నారు. పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు మార్కెట్‌లోని డిమాండ్‌ను దెబ్బ తీయవచ్చ న్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం అంతర్జాతీయ అనిశ్చితికి దారి తీసిందన్నారు. ఇప్పటికే 2022-23తో పోల్చితే 2023-24లో భారత ఎగుమతులు తగ్గాయన్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావం వల్ల భారత్‌ నుంచి యుఎఇ, ఇరాన్‌లకు వెళ్లే ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️