ఇన్‌స్టామార్ట్‌తో స్విగ్గీమాల్‌ అనుసంధానం

Apr 18,2024 21:10 #Business, #Swiggy

న్యూఢిల్లీ : క్విక్‌ కామర్స్‌ సంస్థ ఇన్‌స్టామార్ట్‌ను స్విగ్గీమాల్‌తో అనుసంధానం చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇన్‌స్టామార్ట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నిత్యావసర సరకుల డెలివరీకే పరిమితమైన ఇన్‌స్టామార్ట్‌ ఇకపై దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, స్టేషనరీ తదితర 35 రకాల వస్తువులను అందించనున్నామని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ హెడ్‌ ఫణి కిషన్‌ తెలిపారు. ఇందులో బుక్‌ చేసిన ఉత్పత్తులను గంటలోనే డెలివరీ చేయడం దీని ప్రత్యేకత.

➡️