అందరికీ ఆదర్శం మహాత్మా జ్యోతిరావు ఫూలే- ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష

బాషాప్రజాశక్తి – కడప మహాత్మా జ్యోతిబా ఫూలేే దేశంలో మొదటి సారిగా మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడని, మనమందరం ఆయన అడుగు జాడల్లో నడవాలని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాష, వైసిపి జిల్లా అధ్యక్షులు, నగర మేయర్‌ సురేష్‌ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బంగారు నాగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్టాండ్‌ సర్కిల్‌లోని మహాత్మ జ్యోతిబా ఫూలేే 133వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి వెనుకబడిన వర్గాల వారికి ఆశాజ్యోతి అయ్యారన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను దోపిడీ వ్యవస్థ, అంటరాని తనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కషిచేసిన మహోన్నత అన్నారు. ఇలాంటి మహనీయులను స్మరించుకుంటూ ఆయన వేసిన బాటలో మనమందరం పయనించాలని కోరారు. జాతీయ బి.సి. మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లికార్జున, కమిటీ సభ్యులు జె వి రమణ, సిందే భాస్కర్‌ నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ మహమ్మద్‌ షఫీ, నాయకులు ఆఫ్జల్‌ ఖాన్‌, నరపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కష్ణ, ఆదినారాయణ, బాదుల్లా, హెచ్‌ రహీం, నాయకుర్రాళ్ళు టి.వి సుబ్బమ్మ, మరియలు, నారాయణమ్మ, వివిధ కుల సంఘాల నాయకులు జెవి రమణ, వినోద్‌, సిందే భాస్కర్‌, నాయకులు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : జ్యోతి రావు ఫూలే133వ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఇసి సురేంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, అదనపు పరీక్షా నియంత్రణ అధికారి డాక్టర్‌ సుప్రియ, నేషనల్‌ ఈవెంట్‌ కో-ఆర్డినేటర్‌ మనోహర్‌,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో.. సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల అభివద్ధికి కషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే అని డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు కొనియాడారు. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లో ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షులు విజరు, యూసఫ్‌,నాయకులు యస్‌. సజీద, మూర్తి, జగదీష్‌, పవన్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో.. ఒబిసి జిల్లా అధ్యక్షులు చిన్న కులాయప్ప ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, సమాచార హక్కు చట్టం రాష్ట్ర చైర్మన్‌ కోటపాటి లక్ష్మయ్య, రాష్ట్ర బిసి సెల్‌ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర మైనార్టీ వైస్‌ చైర్మన్‌ పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌, బీసీ సెల్‌ నగర అధ్యక్షులు కల్లూరు వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మానవ హక్కుల జిల్లా ఉపాధ్యక్షులు సిద్దయ్య, సూర్యం పాల్గొన్నారు. బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. మహాత్మ జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిరావు ఫూలేేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముం దుకు నడవాలని ఈ సందర్భంగా గోవింద నాగరాజు అన్నారు. కార్యక్ర మంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందు నాగరాజు, గౌరవ సలహా దారులు గురుస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివిక్రమ్‌ యాదవ్‌, జిల్లా యువజన అధ్యక్షులు సిఆర్‌ఐ సునీల్‌ జయంత్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లూరు నారాయణమ్మ, ఎంప్లాయిస్‌ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కళ్యా సుధాకర్‌, ఆర్ల గంగయ్య, సుంకర రామచంద్రుడు, రాష్ట్ర నాయకురాలు జయశ్రీ, నగర ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావు, నగర ఉపాధ్యక్షులు మల్లికార్జున యాదవ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగరాజు, రంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జ్యోతిరావు ఫూలే అస్పశ్యతా నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమించిన మహాత్ముడు అని బిసి సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాసా కోదండరామ్‌ అన్నారు. మంగళవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. బద్వేలు : నేటి యువతీ యువకులు మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా డివై ఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.కె. మస్తాన్‌ షరీఫ్‌, గంగనపల్లి నాగార్జున, మహిళా కో కన్వీనర్‌ నాగలక్ష్మి ,పట్టణ నాయకులు ఓబుల్‌ రెడ్డి బి శివకుమార్‌, ఇమ్మానేలు ,రాజా, వెంకటసుబ్బయ్య, రాజన్న పాల్గొన్నారు. వేంపల్లె : మహిళా విద్యా కోసం పాటుపడిన మహనీయుడు మహత్మా జ్యోతిరావు పూలే అని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం పూలే వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి తులసిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రామకృష్ణ, ఉత్తన్న, చెన్నకేశవ, బద్రి, రాఘవయ్య, సుబ్బరాయుడు, వినరు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని, చదువుతోపాటు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నేటి పాలకులదేనని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ అన్నారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు నవీన్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️