అంబేద్కర్‌కు నివాళి

Jan 8,2024 19:06
ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం

ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
అంబేద్కర్‌కు నివాళి
ప్రజాశక్తి – వలేటివారిపాలెంమండలంలోని పోకూరులో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట జెడ్‌పిటిసి ఇంటూరు భారతి అధ్యక్షతన జన్‌ భాగీదారి కార్యక్రమం నిర్వహించారు. విజయ వాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈనెల 19 న ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రమంతట జన్‌ భాగీదారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్పిటిసి ఇంటూరు భారతి అధ్యక్షతన ఇక్కడ జరిగిన కార్య్కమంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు.గ్రామ సచివాలయం ఎదుట ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపిపి మౌనిక, ఎంపిడిఒ పరిటాల వీరస్వామి, అగ్రికల్చర్‌ అధికారి అనుముల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి,సచివాలయ సిబ్బంది ఉన్నారు.

➡️