అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలి

ముదినేపల్లి: అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు దళితులు నడుం బిగించాలని స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ కె.నిరీక్షణ రావు కోరారు. ముదినేపల్లిలో అలేఖ్య ప్లాట్స్‌లో మాల మహానాడు, అనుబంధ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ సేవ నాగ జగన్‌ బాబురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిరీక్షణ రావు మాట్లాడుతూ కుల,మత బేధం లేకుండా అన్ని కులాల వారిని ఐక్యం చేసే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సేవ రాజ్‌ కుమార్‌ పి.ప్రతాప్‌, ఏసుపోగు దానియేలు, జక్కుల విజయకుమార్‌ హాజరైయ్యారు.

➡️