అధికారులను అడ్డుకున్న సిపిఎం నాయకులు

Dec 19,2023 21:44 #cpm leaders
ఫొటో : అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టకుండా అడ్డుకున్న సిపిఎం నాయకులు

ఫొటో : అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టకుండా అడ్డుకున్న సిపిఎం నాయకులు
అధికారులను అడ్డుకున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-నెల్లూరు : అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో మంగళవారం నెల్లూరు రూరల్‌ మండలంలోని పాతవెల్లంటి, కొత్తవెల్లంటి పంచాయతీల్లోని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించిన సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, విఆర్‌ఒలను సిపిఎం, సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలు నోటీసు ఇచ్చి సమ్మె చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాల తాళాలు పగులగొట్టే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ విధమైన చర్యలను సిపిఎం, సిఐటియు తరఫున తాము ఖండిస్తున్నామన్నారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేయని పక్షంలో అంగన్‌వాడీలు సమ్మె చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో సమ్మె ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు.

➡️