అన్యాక్రాంతమైన భూములను కాపాడాలి

Mar 5,2024 00:15

భూములను పరిశీలిస్తున్న కార్మికులు
ప్రజాశక్తి-తాడేపల్లి :
కెసిపి సిమెంటు ఫ్యాక్టరీకి చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు కె.స్టాలిన్‌, కె.యొహోషావ, ఎస్‌.బెనర్జీ, ఎం.ఆశీర్వాదం కోరారు. సోమవారం కార్మికులకు చెందాల్సిన భూములను అన్యాయంగా అమ్మకాలు సాగిస్తున్న బయట వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎసిసి భూములకు హద్దుగా ఉన్న మల్లెలమ్మ వాగును దాటి అక్రమార్కులు భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. కార్మికులు సోమవారం ఆ భూముల్లోకి వెళ్లి పరిశీలించారు. హద్దు రాళ్లు దాటి దొడ్డిదారిన అనధికారికంగా రిజిష్టర్‌ చేయించుకున్నారని, సాయిబాబా గుడి ఉన్న చోట భూములను కూడా అన్నీ హద్దులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు దక్కాల్సిన ఈ భూములను సంబంధంలేని బయట వ్యక్తులు చొరబడి అక్రమార్జనకు పాల్పడ్డారని, కార్మికులకు చెందాల్సిన ఎసిసి భూములను ప్రభుత్వం ఇప్పటికైనా అమ్మి కార్మికులకు ఇవ్వాలని కోరారు. లేకుంటే న్యాయ పోరాటంతో పాటు భూముల్లోకి కూడా వెళ్లి స్వాదీనం చేసుకుంటామని హెచ్చరించారు.

➡️