అవయవదానం ప్రాణ రక్షణకు దోహదం

Nov 27,2023 23:13
సమావేశంలో మాట్లాడుతున్న

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కోమాలోకి వెళ్లిన వ్యక్తి బతకడం అసాధ్యమని వైద్యులు నిర్ధారిస్తే అలాంటి వారి అవయవాలను ఇతరులకు అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడిన వరు అవుతారని డాక్టర్‌ అడ్డాల సత్యనారాయణ అన్నారు. రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవాలు అవసరమైన వారు ఎందరో ఉన్నారని, మార్పిడి చేయగల పరిజ్ఞానం కూడా ఉందన్నారు. రెండు మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు తదితర అవయవాలే కాకుండా బోన్‌ టిష్య్‌, స్కిన్‌, కార్నియా వంటి సూక్ష్మ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్‌, బుద్ధ రాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️