ఉపాధిని దెబ్బతీసే యత్నాలను విరమించాలి

Mar 4,2024 21:36

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : విఒఎల ఉపాధికి విఘాతంకలిగించే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుచేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని ఎపి.వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ధర్మరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో ఈ మేరకు వినతి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ మాట్లాడుతూ విఒఎల ఉపాధిని దెబ్బతీసే మూడేళ్ల కాలపరిమితి సర్క్యూలర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌.ఆర్‌ పాలసి అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, విఒల మెర్జ్‌ ఆపాలి, కొత్త విఒల విఓఏ లతో సహా అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, స్వావలంబన అమౌంట్ను తిరిగి సభ్యులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన రూ.2వేల బకాయిలు చెల్లించాలని, విఒల మెర్జ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన విఒఎలకు నష్ట పరిహారం ఇవ్వాలని, గుర్తింపు కార్డు, యూనిఫామ్‌ ఇవ్వాలని కోరారు. పొదుపు మహిళలకు రూ.20 లక్షలకు జీరో వడ్డీ వర్తింప చేయాలని, డ్వాక్రా సభ్యులతో బలవంతంపు కొనుగోళ్లు చేయించరాదని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విఒఎలు పాల్గొన్నారు.

➡️