ఎమ్మెల్యేపై అసమ్మతి నేతల భేటి

అసమ్మతి నేతలతో డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గంలో వైసిపి అసమ్మతి నేతలు తాజాగా ఆదివారం సమావేశమయ్యారు. నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వ్యతి రేకతతో ఉన్న సీనియర్‌ నేత డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి తన రాజ కీయ భవిష్యత్తుకు తక్షణ కార్యాచరణ కోసం మరోసారి సమా వేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరసరావుపేట నియో జకవర్గంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణిపై మరో సారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమా చారం. ఎంపి (రాజ్యసభ సభ్యులు)ఇటీవల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇరు వురు నేతలతో భేటి ఏర్పాటు చేసి గోపిరెడ్డికి మళ్లీ నరసరావుపేట అసెంబ్లీ సీటు కేటా యిస్తు న్నట్లు, ఆయన గెలుపునకు సహకరించాలని కోరారు. తమ నిర్ణ యం చెప్పేందుకు కొంత సమయం కావాలని చెప్పి, తాజాగా ఆదివారం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం.

➡️