కరువు రైతులను ఆదుకోవాలని ధర్నా

Nov 24,2023 17:48 #ధర్నా
ధర్నా

ప్రజాశక్తి-కాకినాడ జగ్గంపేటలో సాగు నీరు లేక పంటలు ఎండిపోయి కరువుతో రైతులు అల్లాడుపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో మధు మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావంతో తీవ్ర కరువ పరిస్థితిని ఎదుర్కొంటున్న మండలాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో సుమారు 470 మండలాల్లో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదై తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తున్నాయిని చెప్పారు. వర్షాభావంతో దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు రూ.50 వేలు, వాణిజ్య పంటలకు రూ.75 వేలు, ఉద్యాన పంటలకు రూ.లక్ష నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ ధర్నాలో కె.బోడకొండ, తోకల ప్రసాద్‌, పి.సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, రామారావు, సత్య, సుబ్బమ్మ పాల్గొన్నారు.

➡️