కొనసాగుతున్న అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఒంగోలు నగర అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు వేతనాల పెంపుదల గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. తొలుత ఒంగోలు నగర అభివద్ధి కమిటీ నాయకులు మారెళ్ళ సుబ్బారావు, బత్తుల ముసలారెడ్డి. దండు అంజిరెడ్డి. అబ్బూరి లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సమ్మెలో భాగంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. టంగుటూరు అంగన్‌వాడీల సమ్మెకు టంగుటూరు, జరుగుమల్లి మండలాలకు చెందిన యుటిఎఫ్‌ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టంగుటూరు యుటిఎఫ్‌ మండల కమిటీ రూ 20,000, జరుగుమల్లి కమిటీ రూ. 5000 కలిపి మొత్తం రూ 25,000 సంఘీభావ నిధిని అంజదేశారు. అదేవిధంగా సమ్మె చేస్తున్న సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులకు రూ.54 వేల నిధిని ఎంఇఒ-2 తన్నీరు బాలాజీ ద్వారా సిఆర్‌పిలు, ఎంఆర్‌పిలకు యుటిఎఫ్‌ నాయకులు అందించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు టంగుటూరి రాము, వేశపోగు మోజెస్‌, టంగుటూరు, జరుగుమల్లి మండలాల యుటిఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, పూర్ణశ్రీ, షేక్‌ మస్తాన్‌, పుట్టా వెంకట్రావు, సీనియర్‌ నాయకులు నారాయణరావు, దామచర్ల శ్రీధర్‌, ముప్పరాజు సురేష్‌, పీడీ వెంకట్రావు, పూనాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెలిగండ్ల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు మెడకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ ఎస్మాను తక్షణమే రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు రాధమ్మ, సిఐటియు జిల్లా నాయకులు రాయల మాలకొండయ్య, ముక్కు మహాలక్ష్మమ్మ, సోం వెంకట శ్రీలక్ష్మి, అనురాధ, వెంకట లక్షమ్మ, రెడ్డమ్మ తిరుపతమ్మ, సువర్ణ, రూతు ,స్వప్న ,సుధారాణి ,సరస్వతి, ఆదిలక్షమ్మ, పెద్దక్క, రఫియా తదితరులు పాల్గొన్నారు. కొండపి : జీవో నెంబర్‌ 2ను వెంటనే రద్దు చేయాలని అంగన్‌వాడీ డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.వందనం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాద్యక్షుడు కెజి.మస్తాన్‌ పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్‌ : అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దారు సీతారామయ్యకు వినతి పత్రం అందజేశారు. తొలుత సిఐటియు కార్యాలయం వద్ద నుంచి తహశీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.ఆవులయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు పద్మ, నరసింహులు, సిఐటియు రాచర్ల మండల నాయకుడు థామస్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగయ్య మురళి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు స్వర్ణ, ఫాతిమా ,రూతమ్మ , స్వచ్ఛభారత్‌ కార్మిక సంఘం నాయకుడు ఆనందరావు, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం నాయకులు లక్ష్మీదేవి, కుమారి , నరసమ్మ ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. కనిగిరి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి. కేశవరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుజాత, సీత, రజిని, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌందర్య, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకులు నరేంద్ర, ఐద్వా నాయకులు బషీరా, శాంత కుమారి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. దర్శి : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు తాండవ రంగారావు డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు యాసిన్‌, హనుమంతరావు, సుజాత, రవణమ్మ, తిరుపతమ్మ, దయామణి, సువర్ణ, సువర్ణలత, పాల్గొన్నారు. మద్దిపాడు : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బంకా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆదిలక్ష్మి, అంగనాడీలు పాల్గొన్నారు. నాగులప్పలపాడు : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంతిబాబు తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు రైతు, కౌలు రైతు సంఘాలు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి టి. శ్రీకాంత్‌, అంగన్‌ వాడీ యూనియన్‌ నాయకులు వెంకటసుబ్బమ్మ, దుర్గాభవాణి, రమ,ఉప్పుటూరి అరుణ,రజనీ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం.రఫీ, ఏరియా కో ఆర్డినేటర్‌ షేక్‌ అమీర్‌బాషా, అంగన్‌వాడీ నాయకులు మల్లేశ్వరి, పి.సుభాషిణి, నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజ కుమారి, సుబ్బులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు జీవో 2 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, మేరికుమారి, కాశీశ్వరి పాల్గొన్నారు.

➡️