కౌలు రైతులనూ ఆదుకుంటాం

అచ్చంపేట: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు అన్నారు గురువారం. అచ్చం పేట మండలంలోని ఓర్వకల్లు, రుద్రవరం, చిగురుపాడు, అచ్చంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు తుపాను వల్ల నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో పంట నష్టం వివరాలను, తీసుకుంటున్న చర్య లను ఇప్పటికే కలెక్టర్‌, సిఎం దృష్టికి తీసు కళ్లినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా పంట నష్టం వివరాలు అందించాలని అది óకారులను ఆదేశించామన్నారు. ప్రతి ఎకరాకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది వర్షా భావ పరిస్థితులున్నా, ఖరీఫ్‌ సాగు ఆశా జనకంగా ఉందన్నారు. అలాంటి సమ యంలో మిచాంగ్‌ తుపాను వల్ల నష్టం జరిగిందన్నారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకునేదుకు చర్యలు తీసుకుంటామన్నారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కూడా మద్దతు ధరకే ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పత్తి, మిరపతోపాటు ఇతర పం టలకు జరిగిన నష్టం గురించి రైతులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పెదకూరపాడు: తుపాను ప్రభావం పెద కూరపాడు నియోజకవర్గంపై ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు పెదకూరపాడు మండలంలో ఖమ్మంపాడు లో నీట మునిగిన పంటలను అధికారు లతో కలిసి పరిశీలించారు. పంట నష్టం అంచనాపై అధికారులకు పలు సూచనలు చేశారు. పంటలను పరిశీలించారు. రైతు లను పరామర్శించారు. నియోజకవర్గం లోని ప్రతి మండలంలో పంట నష్టం అంచనాలు సిద్ధంచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఎకరాకు నష్టపరి హారం అందేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పత్తి, మిరపతో పాటు కంది, పెసర, మినప పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టు చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలుగా శనగ వేసే రైతులకు వెంటనే విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

ఐదు వేలకు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రొంపిచర్ల: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలో వడ్లమూడివారిపాలెం, కొనకంచివారిపాలెం, రొంపిచర్ల గ్రామాల్లో నరసరావుపేట ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి, మొక్క జొన్న, మంచిశనగ, వరి, మినుము, ప్రత్తి పంటలను వ్యవసాయ, ఉద్యానవ నశాఖల అధికారులతో కలిసి పరి శీలిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండ లంలో 5 వేలకు పైగా ఎకరాలలో పం టలు దెబ్బ తిన్నాయని అన్నారు. రైతులు సాగు చేస్తున్న మిర్చి, మొక్కజొన్న, మంచిశనగ, మినుము, బావులు, బోర్లు క్రింద సాగు చేస్తున్న వరి పంట కూడా పూర్తిగా దెబ్బ తిందని అన్నారు. దెబ్బతిన్న పంటల వివ రాలను అంచనా వేసి ప్రభు త్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆద ేశించారు. తహశీల్దార్‌ జి. అంకారావు, వ్యవసాయశాఖ ఎడిఎ పి.మస్తా నమ్మ, ఎంపిపి గడ్డం వెంకట్రావు, సర్పంచులు పొనుగోటి వెంక ట్రావు, మాజీ సర్పంచ్‌ కోటిరెడ్డి పాల్గొన్నారు.

➡️