ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

ప్రజాశక్తి- నెల్లిమర్ల : స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ జన్మదినం సందర్భంగా డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తక్కువ ఖర్చుతో బోధనాభ్యాస పరికరాలు తయారు చేసి చూపించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గణిత శాస్త్రానికి రామానుజన్‌ చేసిన సేవలు కొనియాడారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ యు. మాణిక్యం నాయుడు, అధ్యాపకులు కె. రామకృష్ణా రావు, జివిఎస్‌ఎస్‌ నాగేశ్వరరావు, స్టాఫ్‌ సెక్రటరీ డి. ఈశ్వర రావు, గణిత శాస్త్ర అధ్యాపకులు కె. సూర్యారావు, వివిజెఎస్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.బాడంగి: స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు హాజరై శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన గణిత ప్రాజెక్టులను పరిశీలించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దత్తి సత్యనారాయణ, గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.రామభద్రపురం: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముగ్గుల్లో గణితం అనే అంశం పైన ముగ్గులు పోటీలు, గణితం పై క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కామేశ్వరరావు, స్టాఫ్‌ సెక్రటరీ మురళీధర్‌, ఉపాధ్యాయులు దాలినాయుడు పాల్గొన్నారు.శృంగవరపుకోట: మండలంలోని భవానినగర్‌లో గల గౌరీ విద్యానికేతన్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌లో శుక్రవారం ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఎం సుబ్బరాజు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు గురించి వివరించారు. గణితంపై ప్రతిభా పరీక్ష, క్విజ్‌ పోటీలు ప్రాజెక్ట్‌ ప్రదర్శన నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాండ్రేగుల వెంకట రాము, కరస్పాండెంట్‌ కాండ్రేగుల సన్యాసినాయుడు, గణిత ఉపాధ్యాయులు బి. గణేష్‌, బి. నరేష్‌, పి. గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు. వంగర: స్థానిక వివేక్‌ మాస్టర్‌ మైండ్స్‌ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్‌ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించిన తహశీల్దార్‌ డి. ఐజాక్‌ రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలవేసి గణితంలో నిర్వహించిన పలు పోటీలలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం గణిత ఉపాధ్యాయులు బి.ఈశ్వరరావు, ఎం.వెంకటపతి, వై. హరిబాబులకు విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో సన్మానం చేశారు.లక్కవరపుకోట: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, శ్రీ చైతన్య ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల, ఎపి మోడల్‌ స్కూల్‌ తదితర పాఠశాలలో రామానుజన్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులు వేసిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద, శ్రీ చైతన్య, జ్యోతిరావుపూలే, ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, ఎస్వీ రమణ, పాత్రో పాల్గొన్నారు.విజయనగరం కోట: ప్రపంచ మేధావి శ్రీనివాస్‌ రామానుజన్‌ పుట్టినరోనజు సందర్భంగా పలుచోట్ల శుక్రవారం మ్యాథ్స్‌డే వేడుకలు జరిగాయి. గాజులరేగలోని నారాయణ పబ్లిక్‌ స్కూల్‌లో శ్రీనివాస రామానుజన్‌ 136వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి విద్యార్థులు ఉపాధ్యాయులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన పరిశోధన సంఖ్య 1729ను పలకలపై రాసి విద్యార్థులతో ప్రదర్శించారు. కరస్పాండెంట్‌ మొయిద నారాయణరావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్‌ గొప్ప గణిత మేధావి అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.నారాయణ స్కూల్లో ఘనంగా మాథ్స్‌ డే విజయనగరం టౌన్‌ : శ్రీనివాస రామానుజం పుట్టినరోజు సందర్భంగా స్థానిక రింగురోడ్డు వద్ద గల నారాయణ పాఠశాల లో శుక్రవారం ‘మాథ్స్‌ డే నిర్వహించారు. హెచ్‌ఎం ప్రభావతి దేవి, ఆర్‌ఐ రాజేష్‌ , హైస్కూల్‌ కో.ఆర్డినేటర్‌ వెంకట్‌ మంట్లాడుతూ గణితం గొప్పతనాన్ని వివరించారు. బొబ్బిలి: పట్టణంలోని గణిత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో గణిత పితామహుడు శ్రీనివాస్‌ రామానుజన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థానం పాఠశాలలో గణిత ఉపాధ్యా యులు ఎన్‌విఆర్‌ సత్యనారాయణ మూర్తిను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

➡️