జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని దేవుదల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 8వ తరగతి విద్యార్థిని వై.యశోద అండర్‌ 17 కబడ్డీ జాతీయ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ ఎం.లక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ నెల 26న చిత్తూరు జిల్లా చోడిపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయిలో ఎంపికైనట్లు తెలిపారు. 2024 జనవరిలో ఒడిస్సా రాష్ట్రం జైపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఆడనునట్లు తెలిపారు. యశోద ఎంపిక పట్ల ఎంఇఒలు వరప్రసాదరావు, యరకయ్య, పిఇటి అమ్మాజీ, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.పూసపాటిరేగ: మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ జూనియర్‌ కళాశాల విద్యార్థి కర్రోతు యశ్వంత్‌కుమార్‌ జాతీయస్ధాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన అండర్‌ -17 అంతరజిల్లా కబడ్డీ పోటీలలో విజయనగరం జిల్లా ప్రథమస్ధానం లబించిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌లో వైస్‌ కెప్టెన్‌గా యశ్వంత్‌కుమార్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. దాంతో ఆ విధ్యార్ధిని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. కళాశాల విధ్యార్ధి జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలకు ఎంపికవడంతో కరస్పాండెంటు కనకమహాలక్ష్మి అబినందించారు. జాతీయస్ధా యిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యశ్వంత్‌ కుమార్‌ను కళాశాల అధ్యాపకులు, తోటి స్నేహితులు అభినందించారు. బొబ్బిలి: డిసెంబర్‌ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లో సబ్‌ జూనియర్‌, క్యాడిట్‌ జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 18, 19 తేదీల్లో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో గోల్డ్‌ మెడల్‌ సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికైన బొబ్బిలి కి చెందిన బి.గౌతమీ( సురేష్‌ స్కూల్‌ ), ఎస్‌.జాజిలి ( ఐరిస్‌స్కూల్‌), డి.ఆదిత్య, (శ్రీ చేతన్య స్కూల్‌ )లను బొబ్బిలి సీనియర్‌ తైక్వాండో కోచ్‌ బంకురు ప్రసాద్‌, బొబ్బిలి తైక్వాండో క్లబ్‌ అధ్యక్షలు బేబీనాయన, జిల్లా తైక్వాండో సెక్రటరీ చెలికాని వేణుగోపాల్‌ రావు అభినందించారు.

➡️