‘టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి.. యువతకు ఉపాధి’

 నరసరావుపేటలో ప్రచారం చేస్తున్న చదలవాడ అరవిందబాబు

పల్నాడు జిల్లా: రాష్ట్రాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు టిడిపి ద్వారా సాధ్యమని రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి నరస రావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని 28,29 వార్డులో స్థానిక పాండురంగ, కుసుమ హరినాథ్‌ స్వామి దేవాలయ ప్రాంతంలో శనివారం ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్య క్రమంలో బాగంగా డాక్టర్‌ చదలవాడ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. డాక్టర్‌ చదలవాడ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కుల,మత,వర్గ,ప్రాంతీయ భేదాలు రెచ్చ గొడుతున్నారన్నారు. కొత్త పెట్టుబడులు తీసుకురాక పోగా ఉన్న పరిశ్రమలు వెళ్ళగొడుతున్నారని విమ ర్శించారు. ప్రశ్నార్థకంగా మారిన రాష్ట్ర భవిష్యత్తును గాడిన పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు అందిస్తు వైసిపి నాలుగున్నరేళ్ల కాలంలో , ఆరాచకాల, దాడు లను వివరించారు.

➡️