డ్రెయినేజీలో పడి వృద్ధుడు మృతి

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

మండలంలోని అన్నవరం గ్రామంలో బుధవారం పిల్లి కృష్ణమూర్తి(65) సైకిల్‌పై వెళుతూ డ్రెయినేజీలో పడి మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ తలారి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు డ్రెయినేజీ ఉధృతంగా ప్రవహించడంతో బయట పడలేక అందులోనే వృద్ధుడు చనిపోయినట్లు తెలిపారు.

➡️