‘తాటిపర్తి’ ఆత్మీయ సమ్మేళనం

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: ‘సామాన్య కార్యకర్తనైన నేను జగనన్న ఆశయాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గానికి సేవ చేసేందుకు వైసీపీ అభ్యర్థిగా వచ్చాను, ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని యర్రగొండపాలెం నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం పెద్దదోర్నాలలోని శివసదన్‌లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. అందరినీ సమన్వయంతో కలుపుకొని వెళ్తానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులంతా కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుమ్మా పద్మజ యల్లేష్‌, జడ్పిటిసి లతా చంద్రకాంత్‌, సర్పం చ్‌ చిత్తూరి హారిక, మండల కన్వీనర్‌ గంటా వెంకట రమణారెడ్డి, నాయకులు అబ్ధుల్‌ మజీద్‌, ఆళ్ల ఆంజనేయ రెడ్డి, సింగారెడ్డి పోలిరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, జోగి వెంకట నారాయణ, వెన్నా కాశిరెడ్డి, గుండారెడ్డి రమణారెడ్డి, రసూల్‌తో పాటు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️