దోచుకున్న నిధులను తిరిగి చెల్లించాలి:జివి ఆంజనేయులు

ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం-పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ సమావేశంలో మాట్లాడుతున్న జివి ఆంజేయులు

వినుకొండ: దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివద్ధి చేయాల్సిన సీఎం వేలకోట్ల పంచాయతీ నిధులను దోచుకొని అభివృద్ధికి తూట్లు పొడిచారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గల అవ్వరు ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం-పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. అనంతరం మీడియాతో ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా విడుదల చేసిన 8600 కోట్ల నిధులను రాష్ట్ర సీఎం జగన్మోహన్‌ రెడ్డి సి ఎఫ్‌ ఎం ఎస్‌ ద్వారా లాగేసుకొని దోచుకున్నాడంటూ విమర్శించారు. (ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్‌) ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం గ్రామీణ అభివృద్ధికి రూ. 36 వేల కోట్లు విడుదల చేస్తే ఆ నిధు లను కూడా జగన్‌ రెడ్డి దోచుకున్నాడని ఆరోపించారు. అసమర్థ వైసిపి పాలనలో పనులు చేస్తే బిల్లులు రావు అనే భయంతో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లకు ముం దుకు రాని పరిస్థితి దాపురించిందన్నారు. కరెంటు బిల్లుల సాకుతో వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో దోచుకున్న వేలకోట్ల పంచాయతి నిధులను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలకు విలువ లేకుండా చేస్తూ, పంచాయతి నిధులను స్వాహా చేసి కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాట మాడా రన్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కె.శ్రీని వాసులు, ఎం. శివ శంకర్‌ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,670 గ్రామ పంచాయతీలకు రూ.8,600 కోట్లు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా సర్పంచుల సంతకాలు లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు డ్రా చేసి గ్రామాల అభివృద్ధిని అడ్డు కుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీన విజయవాడలో రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమా వేశానికి రాష్ట్ర అఖిలపక్ష పార్టీ నేతలు హాజరవు తున్నారని, 16 అంశాలతో కూడిన డిమాండ్లను వారి ముందు ఉంచనున్నట్లు చెప్పారు. అనంతరం విను కొండ నియోజకవర్గం సర్పంచుల సంఘం ఎన్నిక ఏక గ్రీవమైంది. కార్యక్రమంలో టిడిపి నాయకులు, జడ్పిటిసి పి.హైమావతి. డిఎల్డిఏ చైర్మన్‌ ఎల్‌. వెంకటరావు, జి.శ్రీనివాసరావు, జి.సాంబశివరావు, పి.నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

➡️