నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి అంబటి

Dec 6,2023 23:08 #ambati rambabu, #crop, #Cyclone, #minister
సత్తెనపల్లి మండలం నందిగామ లో దెబ్బతిన్న మిర్చి పంటలను పరిశీలిస్తున్న మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌: తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లి మండలంలోని నందిగామలో తుపాను వరద ముంపునకు గురై దెబ్బతిన్న మిర్చి పొలాలను మంత్రి బుధవారం పరిశీలించారు.రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల వివ రాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరి ధిలో 9,190 హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉం డగా 3,432 హెక్టార్లు ఈ ఏడాది సాగులో ఉందని, వీటిలో 480 హెక్టార్లు మిరప,శనగ పంటలు వరద ముంపునకు గురికాగా 55 హెక్టార్ల వరి ఇతర పంటలు తుఫాను గాలులకు నేలకొరిగి పంట నష్టం జరిగిందని మంత్రి కి ఇన్చార్జి ఏడిఎ శ్రీధర్‌ రెడ్డి వివరించారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను అంబటి రాంబాబు ఆదేశించారు.రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం నిబంధనల ప్రకారం అందించేలా కృషి చేస్తామన్నారు. వరద ముంపునకు ఇతర విధంగా నష్టపోయిన రైతులకు వ్యవ సాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి తాత్కాలిక ఉపశమన మార్గాలను, నష్ట నివారణకు చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రూరల్‌ మండలం వైఎస్‌ఆర్సిపి అధ్యక్షులు రాయ పాటి పురుషోత్తం రావు, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయ భాస్కరరెడ్డి , తహశీల్దార్‌ సురేష్‌ నాయక్‌ వైసిపి నేతలు కట్టా సాంబయ్య, ఆళ్ల జగ్గయ్య పాల్గొన్నారు. ‘వాగుపై వంతెన నిర్మిస్తాం’ సత్తెనపల్లి: భారీ వర్షాలతో సత్తెనపల్లిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాలైన మాస్తిన్‌ పేట, సుందరయ్య కాలనీ, నాగన్న కుంటలలో వర్షపు నీరు వచ్చి చేరింది.దీంతో స్థానిక ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్‌ రోడ్డులోని దాసరి ఉమా మహేశ్వరరావు ఇంటిముందు, కస్తూర్బా బాలికల పాఠశాలలు ఆవరణలో వర్షపు నీరు బారీగా వచ్చి చేరింది.దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో పలు ప్రాంతాలలో వర్షపనీరు వచ్చి చేర డంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విషయం తెలుసు కున్న మున్సిపల్‌ కమిషనర్‌ ఆయా ప్రాం తాలను సందర్శించి ప్రోక్కులైనరు సహా యంతో వర్షపు నీరుని బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల కమిషనర్‌ కు అభి నందనలు తెలిపారు. పట్టణంలోని 19, 20,21 వార్డులకు సంబంధించిన శ్మశానానికి వెళ్లే మార్గంలో వాగు పొంగి పొర్లింది. దీంతో సుందరయ్య కాలనీ, కొత్తపేటలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంద ర్భంగా మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ కె షమ్మి లు వాగు ప్రదేశాన్ని పరిశీలించారు. వాగు పొంగి పొంగి పొర్లిన ప్రతిసారి తాము పడు తున్న ఇబ్బందులను మంత్రికి ప్రజలు వివరించారు. ఈ వాగుపై వంతెన నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని వారు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వీలైనంత త్వరలో ఈ వాగు పై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

➡️