నాగబాబును కలిసిన ‘మలిశెట్టి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ జనసేన పిఎసి సభ్యులు నాగబాబును మంగళగిరిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు జనసేన అసెంబ్లీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివద్ధి పథంలో తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించినట్లు వివరించారు. మలిశెట్టికి జనసేన పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దల దగ్గర మంచి గౌరవం, గుర్తింపు ఉందని నాగబాబు అన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జనసేన రాజకీయ పరిస్థితులను సవి వివరంగా నాగ బాబుకు వివరించారన్నారు. అన్ని విషయాలను కూలంకుషంగా అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు వివరిస్తామని నాగబాబు చెప్పినట్లు మలిశెట్టి తెలిపారు. కార్యక్ర మంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, నాయకులు భాస్కర్‌ పంతులు, పోలిశెట్టి రజిని, పోలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️