నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

Nov 28,2023 23:20
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న

ప్రజాశక్తి – కాకినాడహంసవరంలో నూతనంగా నిర్మించిన 132/33 కేవి విద్యుత్‌ ఉప కేంద్రం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌సరఫరా జరగనుందని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. మంగళవారం సిఎం జగన్మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో పలు సబ్‌ స్టేషన్లను ప్రారంభించారు. తుని మండలం హంస వరంలో రూ.24.64 కోట్ల వ్యయంతో 132/33 కేవి విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, ట్రాన్స్‌కో, ఇపిడి సిఎల్‌ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొని మాట్లాడారు. మారుమూలగా ఉన్న తొండంగి మండలానికి ప్రస్తుతం సుదూ రంలో ఉన్న పిఠాపురం, ప్రత్తిపాడు, పాయ కరావుపేట 132 కేవీ ఉప కేంద్రాల నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోందని, అందు వల్ల లో ఓల్టేజి, అంతరాయాల సమస్యలు ఎదురౌతున్నాయన్నారు. నూతనంగా దగ్గరలోనే తుని మండలం హంసవరంలో నిర్మిస్తున్న 132/33 కేవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా తొండంగి మండలం తోపాటు తుని, శంఖవరం మండలాల వినియోగదారులకు కూడా మెరుగైన విద్యుత్‌ సరఫరా అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ట్రాన్స్‌ కో ఎస్‌ఇ ఎ.గురుబాబు, ఇఇ జె.రామారావు, కాకినాడ డిఇ జి.ప్రసాద్‌, జగ్గంపేట ఇఇ కె.రత్నాలరావు, హంసవరం సర్పంచ్‌ ఆర్‌.మేరీ అవినాష్‌, ట్రాన్స్‌కో, ఇపిడిసిఎల్‌ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️