నేడు నారాయణపురం కాలేజీలో కరాటే పోటీలు

ప్రజాశక్తి – ఉంగుటూరు

నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల పురుషులు, మహిళల కరాటే పోటీలు ఈనెల 29 న జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టికె.విశ్వేశ్వరరావు తెలియజేశారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని ఏలూరు ఆర్‌డిఒ ఎస్‌కెఎన్‌.ఖాజావలీ, తహశీల్దార్‌, ఎంపిడిఒ, అధ్యాపక సిబ్బంది మంగళవారం కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ కరాటే పోటీలు విద్యార్థుల శారీరక, మానసిక ఉన్నతికి తోడ్పడతాయని, స్వీయ రక్షణకు కరాటే మారుపేరని అన్నారు. పోటీల ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ రాజా మేరిసన్‌ బాబు మాట్లాడుతూ 29న పోటీలతో పాటు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కరాటే మహిళ, పురుషుల జట్ల ఎంపిక జరుగుతుందని, ఎంపిక చేసిన పురుషుల జట్టు భోపాల్‌ యూనివర్సిటీలో డిసెంబర్‌ 5వ తేదీన జరిగే సౌత్‌ జోనల్‌ యూనివర్శిటీ టోర్నమెంట్‌లో, మహిళల జట్టు ఢిల్లీలో జరిగే పోటీలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️