పేదల అభ్యున్నతే ధ్యేయం : కోలగట్ల 

Dec 19,2023 21:53

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మంగళవారం లంకపట్నంలోని నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ పొట్నూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. వైసిపి నగర అధ్యక్షులు ఆసపు వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లుగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని వారి అవసరాలను తీర్చడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జొన్న గుడ్డి, లంకా పట్నం తనకు రెండు కళ్ళు లాంటివని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపానికి అంబేద్కర్‌ సామాజిక భవనంగా నామకరణం చేసేందుకు కౌన్సిల్‌ ఆమోదం కోరనున్నామని చెప్పారు. రెల్లి కార్పొరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌ రావు మాట్లాడుతూ చట్టసభలలో తమ వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌ శ్రీరాములునాయుడు, ఇన్‌చార్జి ఇఇ దక్షిణామూర్తి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, పట్నాన పైడిరాజు, పొట్నూరు వెంకటరాజు, పద్మ, బొంగ భానుమూర్తి, ఆర్జి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. నగరంలో వివిధ డివిజన్లలో రూ.80లక్షలతో అభివృద్ధి పనులకు మేయరు వి.విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయిన అభివద్ధి పనులను ప్రారంభించారు. 5,6,11 డివిజన్లలోగడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో విడుదలైన నిధులతో రహదారులు, కాలువలు వంటి మాలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకరం చుట్టారు. ఐదో డివిజన్‌లో రూ.20 లక్షలు, ఆరో డివిజన్లో రూ.20 లక్షలు, 11వ డివిజన్‌లో రూ.40లక్షలతో పనులు చేపట్టారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు వెంపడాపు శ్రీనివాసరావు, 5,6 డివిజన్ల కార్పొరేటర్లు గాదం మురళి, ఆల్తి సత్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 38,39 డివిజన్లో 88 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్చార్జ్‌ డాక్టర్‌ వి.ఎస్‌ ప్రసాద్‌,ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తొగురోతు సంధ్యారాణి, వింత ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️