పోలీస్‌ స్టేషన్‌కు హోంగార్డులను అందిస్తాం : డిఐజి

Dec 23,2023 21:28

ప్రజాశక్తి – కొత్తవలస  : కొత్తవలస పోలీస్‌ స్టేషన్‌కు పని ఒత్తిడి దృష్ట్యా హోం గార్డులను నియమిస్తామని విశాఖ రేంజ్‌ డిఐజి ఎస్‌. హరికృష్ణ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తవలసలో పోలీస్‌ సేవలు సక్రమంగానే ఉన్నాయన్నారు. సిడి ఫైల్స్‌, ఇతర ఫైల్స్‌ను రిజిస్ట్రేషన్‌ చేశారు. రికార్డులు సక్రమంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఎస్‌.కోట ప్రాంతం గుండా గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ గూడ్స్‌ అరికట్టడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విజయనగరం ఎఎస్‌పి అస్మా ఫారహేన్‌, విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, కొత్తవలస సిఐ చంద్రశేఖర్‌, ఎస్‌కోట సిఐ ఎస్‌. బాల సూర్యారావు, కొత్తవలస, ఎస్‌.కోట సర్కిల్‌ పరిధిలో వున్న ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.గరివిడి: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను డిఐజి హరికృష్ణ, ఎఎస్‌పి, డిఎస్‌పి చక్రవర్తితో కలిసి పరిశీలించారు. స్టేషన్‌లోని సీడీ ఫైల్స్‌ను, స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సిఐ ఉపేంద్ర రావు, ఎస్‌ఐ దామోదర రావు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️