ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయండి

Mar 28,2024 19:05

పట్టణంలో సాగుతున్న ర్యాలీ.. ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ (ఇన్‌సెట్‌)
ప్రజాశక్తి – మాచర్ల :
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కు వినియోగం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. ఓటర్లను చైతన్యం చేసేందుకు ఓటర్ల చైతన్య రథంతో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగర్‌ రింగ్‌ రోడ్డు వరకు వెళ్లి తిరిగి తహశీల్ధార్‌ కార్యాలయానికి చేరుకుంది. ఓటు హక్కు వినియోగించు కుందామని, ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామని, ధృడమైన ప్రజా స్వామ్యం కోసం అందరూ ఓటు హక్కు వినియోగించుకుందామనే నినాదాలతో ర్యాలీ సాగింది. మాచర్ల అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ఓటర్లు ప్రలోభాలకు గురికావద్ద న్నారు. సమాజ శ్రేయస్సును ఆలోచన చేసి తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ డి.మంజునాథ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ డి.వెంకటదాసు, ఎంపిడిఓ సరోజినమ్మ, ఎన్‌సిసి క్యాడెట్లు, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️