కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమే

Apr 27,2024 19:10 #movie, #samantha

తన మాటను గౌరవించే అభిమానులు ఉండడం అదృష్టమంటున్నారు సమంత. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అభిమానుల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. నా ఫ్యాన్స్‌లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ. వాళ్లను చూసి ఎన్నో విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. నా మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమే. కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి నేనేం కోరుకోను. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట నా మాటను గౌరవించే వాళ్లు ఉండడం అదృష్టం. నా మనసుకు నచ్చింది చేస్తాను. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని ఆలోచిస్తాను. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరు. అందుకే నేనెప్పుడు మెంటల్‌ హెల్త్‌కు ప్రాముఖ్యతనిస్తాను. దానికోసం అవసరమైన వ్యాయామాలు చేస్తుంటాను’ అని చెప్పారు.

➡️