ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం

Mar 11,2024 21:20

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఫిర్యాదు దారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎఎస్‌పి అస్మా ఫర్హీన్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలోచర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో విజయనగరం డిటిసి డిఎస్‌పి వీరకుమార్‌, డిసిఆర్బి సిఐ జె. మురళి, డిటిఆర్‌ ఎస్‌ఐ ప్రభావతి, డిసిఆర్‌బి ఎస్‌ఐ గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️