బిసిల అభ్యున్నతే లక్ష్యం : ‘మండిపల్లి’

ప్రజాశక్తి-సంబేపల్లె(రాయచోటి) కూటమితోనే బిసిల అభ్యున్నతి సాధ్యమవుతుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం సంబేపల్లెలో జయహో బిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాంప్రసాద్‌రెడ్డికి బిసి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి బిసిల ప్రభు త్వమన్నారు. బిసిల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మరింత మెరు గుపరిచేలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. బిసిల రిజర్వేషన్‌ శాతాన్ని తగ్గించి వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడ్డ ప్రభుత్వం వైసిపి అని గుర్తుచేశారు. టిడిపి బిసిలకు, వారి రాజకీయ ఎదుగుదలకు ప్రత్యేక భూమిక పోసించిదన్నారు. బిసిల ఆత్మగౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వమని తెలిపారు. ఎప్పటికీ వారి వెంట నిలిచి అన్నివిధాలా వారి ఎదుగుదలకు కషి చేస్తానన్నారు. సంబేపల్లె, చిన్న మండెం మండలాలలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న బిసి కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న శ్రీనివాస రిజర్వాయర్‌, ఝరికోన పనులు పూర్తి చేయించి ఇక్కడి వారందరికీ సాగు, తాగునీరు అందిస్తామన్నారు. టిడిపి అధికా రంలోకి రాగానే మండల బిసిలకు సింహాభాగాన్ని కేటాయిస్తామన్నారు. నాలుగు పర్యాయాలు గెలిచిన స్థానిక వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సంబేపల్లె మండల బిసిలకు ఏమిచేశారో చెప్పాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రత్యేక బిసి రక్షణ చట్టం అమలులోకి తీసుకవచ్చి వైసిపి బానిస సంకెళ్లు నుండి బిసిలకు విముక్తి కలిగిస్తానన్నారు. ఎవరితోనూ వ్యక్తిగత తనకు ఎటువంటి విభే దాలు లేవని అనునిత్యం కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉన్నానని ఎప్పుడూ ఉంటానని పార్టీ గెలుపుకోసం కట్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుంటానని పేర్కొన్నారు. సమావేశంలో కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్‌ బాషా, మాజీ సర్పంచ్‌ మండల నాయకుల దుద్యాల రవీంద్రారెడ్డి, దుద్యాల విష్ణు వర్ధన్‌రెడ్డి, నాగేశ్వర్‌ నాయుడు, ఒబిసి మోర్చా రేపన శివప్రసాద్‌, బిసి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మల్లూరు రెడ్డి వరప్రసాద్‌, గుట్టపల్లి ప్రభాకర్‌ నాయుడు, వేణు గోపాల్‌ నాయుడు, మాజీ సర్పంచ్‌ శశిధర్‌, రెడ్డి సహదేవ రెడ్డి, రామచం ద్రనాయుడు, మోటకట్ల శివారెడ్డి, దేవపట్ల భయ్యా రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు హరి యాదవ్‌, బిసిలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️