మండలాభివృద్ధికి కృషి : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమ న్వయంతో మండలా భివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గోళ్ళపాటి సుధారాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆ పథకాలు అర్హులకు అందేలా ఎంపీటీసీలు, సర్పంచులు కృషి చేసి గ్రామాల అభివృద్దికి సహ కరించాలన్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలు లబ్ధిదారుల ఇంటి వద్దే అందిస్తుందన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మాట్లాడారు. విద్యుత్‌ శాఖలో స్తంభాలకు మరమ్మతులు చేపట్టాని అందుకోసం రూ.3 ్షలు నిధులు అవసరమని విద్యుత్‌ ఎఇ తెలిపారు. దీంతో స్పందించిన బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ షేక్‌ షకీలా, వైస్‌ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, ఎంపిడిఒ హనుమంతరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️