మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలో జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్‌ ఆధ్వర్యంలో టి.సుండుపల్లి, వీరబల్లిలో జనసేన మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్‌ పోటీలలో దాదాపు 25 జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడే రెండు జట్లకు మొదటి బహుమతిగా రూ.30వేలు, రెండవ బహుమతిగా రూ.15వేలు, టోర్నమెంట్‌ ట్రోఫిని అందజేయ నున్నట్లు తెలిపారు. ప్రతి మ్యాచ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచినా ఆటగాడికి వెయ్యి రూపా యలు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. మెగా టోర్నమెంట్‌ ద్వారా ప్రతిభ గల యువ కులను ప్రోత్సహించి క్రికెట్‌లో రాణించే విధంగా అన్ని విధాలుగా సహాకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో టి.సుండుపల్లి, వీరబల్లి మండలాల జనసేన నాయకులు, టోర్నమెంట్‌ నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రామాపురం : మండలంలోని రాచపల్లిలో ఆర్‌ఆర్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాచపల్లి టిడిపి నాయకులు ప్రారంభించారు. రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో యువకులకు క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంగళవారం ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలు భాగంగా యువతకు క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తే బాగుంటుందని నాయకులు రమేష్‌ రెడ్డి దష్టికి తీసుకోవడంతో ఆయన ఆదేశాల మేరకు క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మదన్మోహన్‌, పలవల శివారెడ్డి, వెంకట్రాంరెడ్డి, రాజా రాజు, సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు ఖాసీం, పీరా, కిరణ్‌నాయుడు, రామ్మోహన్‌, దేవేంద్ర పాల్గొన్నారు.

➡️