రాష్ట్ర మహిళా కబడ్డీ విజేత కృష్ణా జిల్లా

Dec 21,2023 21:37

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని మహిళా పార్కులో జరిగిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో విజేతగా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి బహుమతులను అందజేసారు. ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా నిలవగా ద్వితీయ స్థానంలో విజయనగరం, తృతీయ స్థానంలో విశాఖపట్నం, నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా జట్లు నిలిచాయి. మొదటి విజేతకు రూ.50 వేలు, రెండో విజేతకు రూ.40 వేలు, మూడో విజేతకు రూ.30వేలు, నాలుగో విజేతకు రూ.20వేలు చొప్పున నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు.

➡️