రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Dec 15,2023 20:58

 గుమ్మలక్ష్మీపురం /కురుపాం : పాలకొండ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహణకు వెళ్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం నుంచి పాలకొండ వెళ్తుండగా కొండబారిడి వస్తున్న బైక్‌ బలంగా ఢ కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. సత్యనారాయణ స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం మండలం జాతపు కలిగొట్టు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం కోసం భద్రగిరి సిహెచ్‌సికి తరలించగా, అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక కూర్చున్న కారిమానుగూడకు చెందిన నిమ్మక సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేసిన బిడ్డిక రంజిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సత్యనారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భార్య లోబో దిబో మంటూ భర్త మృదేహంపై ఏడుస్తూ సొమ్మసిల్లి పోయింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

➡️