లారీ ఢకొీని యువకుడు మృతి

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోధవలస వద్ద 43వ జాతీయ రహదారిలో శనివారం మోటార్‌ సైకిల్‌ను లారీ ఢకొీన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని గోపాలపట్నంకు చెందిన ఇంతియాజ్‌ (27) కే. శేఖర్‌ ఇద్దరూ మోటార్‌ సైకిల్‌ పై విశాఖపట్నం నుంచి విజయనగరం వెల్డింగ్‌ పని చేయడానికి వస్తున్నారు. మోధవలస 43వ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదే రహదారిలో వారి వెనక వస్తున్న లారీ బలంగా ఢకొీనడంతో మోటార్‌ సైకిల్‌తో లారీ వెనుక చక్రాల క్రింద మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న ఇంతియాజ్‌ పడిపోయాడు. దీంతో తలపై నుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లిపోవడంతో ఇంతియాజ్‌ తల నుజ్జు నుజ్జు అయిపోయి అక్కడకక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శేఖర్‌కు రెండు చేతులు విరిగిపోయాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ద్వారా విజయనగరం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ యు మహేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని విజయనగరం ఆసుపత్రికి తరలించి మృతుని భార్య మార్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఇంతియాజ్‌కు ఈ మధ్యనే పెళ్లయి గోపాలపట్నంలో నివాసముంటున్నారు. అతని తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

➡️