లావు బాల గంగాధరరావుకు ఘన నివాళి

Mar 28,2024 22:38

లావు బాల గంగాధరరావు చిత్రపటానికి పూలమాలేస్తున్న నాయకులు
ప్రజాశక్తి – ఫిరంగిపురం :
సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు లావు బాలగంగాధరరావు 21వ వర్ధంతి సభ మండలంలోని పొనుగుపాడులో గురువారం జరిగింది. బాలగంగాధరరావు చిత్రపటానికి నాయకులు షేక్‌ ఖాజా మస్తాన్‌వలి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఎల్బీజీ గుంటూరు జిల్లాలోని క్రాప గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించి, గుంటూరులోని ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివారని, చిన్నతనం నుండి రాజకీయాల వైపు మక్కువ చూపారని అన్నారు. విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగాను, కేంద్ర కమిటీ సభ్యులుగా పార్టీ అభ్యున్నతికి పాటుపడ్డారని, ప్రభుత్వ నిర్బధం వల్ల 11 ఏళ్లపాటు అజ్ఞాతవాసం చేశారని తెలిపారు. నేటి పాలకులు మత ద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజాస్వామ్యం, లౌకికత్వాన్ని, మన రాజ్యాంగానికి తూట్లు పొడు స్తున్న నేపథ్యంలో ఎల్బీజీ ఆశయాల కోసం కృషి చేయాలన్నారు. సభలో నాయకులు జి.వెంకటేశ్వరరావు, జి.రామకోటేశ్వరరావు, వై.నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️