వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జిల్లా జాయింట్‌ కలెక్టర ఆర్‌.గోపాలకష్ణ తెలిపారు. నాగులుప్ప లపాడులో 216 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీ చెక్‌ పోస్టును బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వాహనాల తనిఖీల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. వీడియో రికార్డింగ్‌ నమోదు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల వాహనాలకూ ఎలాంటి మినహాయింపులు లేవని, వారి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. రూ.50 వేలకు మించి ఎక్కువ నగదును ఆధారాలు లేకుండా తరలించరాదని స్పష్టం చేశారు. ఆర్‌టిసి బస్సులు ,ప్రభుత్వ వాహనాలపై ఎలాంటి అనుమానం కలిగిన తక్షణమే తనిఖీలు చేపట్టాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నగదు, అక్రమ మద్యం, తరలింపును అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలతిపారు. ప్రతి చెక్‌ పోస్ట్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎ. శ్రీనివాసరావు, రూరల్‌ సిఐ టిఎక్స్‌.అజరు కుమార్‌, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, రెవెన్యూ ,పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️