విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత

హోమ్‌ శాఖ మంత్రి

ప్రజాశక్తి-చాగల్లుముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోమ్‌ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు. చాగల్లు మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, విద్యా కానుక కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని పరిశీలించారు. వైద్యం అందుకుంటున్న రోగుల వైద్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రతి ఇంటికీ వెళ్లి సిఎం సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికుల నుంచి వచ్చిన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైన్ల సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు వివరించారు. వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సిఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. స్థానికులు రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. అర్హత ఉండి ఏ సంక్షేమ పథకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

➡️