సమస్యలు పరిష్కరించండి

ప్రజాశక్తి-సీతంపేట : తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు గిరిజనులు వినతులు సమర్పించారు. సోమవారం స్పందన కార్యక్రమాన్ని ఐటిడిఎలో పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎం.సింగపురం గ్రామానికి చెందిన అప్పనదొర మేకల లోను ఇప్పించాలని విన్నవించారు. మర్రిగూడకు చెందిన శాంతి కుమారి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు. వజ్జాయిగూడకు చెందిన సరోజిని గ్రూప్‌-2 కోచింగ్‌ పెంచాలని విజ్ఞప్తిచేశారు. గంగంపేటకు చెందిన బాసమ్మ వ్యవసాయ బోరు మంజూరు చేయాలని కోరారు. కరిగాం గ్రామానికి చెందిన రమేష్‌ వైటిసి ఉద్యోగులు జీతాలు ఇప్పించాలని విన్నవించారు. గొట్టిపల్లికి చెందిన నగేష్‌ ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టా మంజూరు చేయాలని కోరారు. పదనాపురం గ్రామానికి చెందిన కామేశ్వరరావు బిటి రోడ్డు మంజూరు చేయాలని అర్జీ అందించారు. తుంబలిగూడకు చెందిన కాంతమ్మ కిరాణా షాపు లోన్‌ ఇప్పించాలని పిఒ దృష్టికి తీసుకొచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎస్‌.సింహాచలం, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, సిడిపిఒ పి.రంగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️