సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం : ఏఐటీయూసీ

Jan 3,2024 15:34 #Dharna, #Kakinada, #muncipal workers

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తారని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ హెచ్చరించారు. సామర్లకోటలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తీర్చాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసే మహిళా కార్మికులు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తీర్చకుండా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ప్రాణాలను పణంగా పెట్టి సైతం మున్సిపల్‌ కార్మికులు పనులు చేస్తుంటే వారి న్యాయమైన కోరికలను తీర్చకుండా చర్చలు జరిపిన అవి పూర్తిగా సఫలం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇదే విధానం కొనసాగితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిపిఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, సీనియర్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎలిసెట్టిరామదాసు ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జున్‌ రావు, సప్ప సూరిబాబు, ఆడప చిట్టిబాబు తదితరులు విప్లవ గేయాలు ఆలపించగా మున్సిపల్‌ యూనియన్‌ నాయకుడు బచ్చా శ్రీను కార్యదర్శి కిషోర్‌ తదితరులు నాయకత్వం వహించగా మునిసిపల్‌ కార్మికులు మహిళలు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రామారావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు.

➡️