సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ప్రజాశక్తి కడప అర్బన్‌ ఈ నెల 30న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి నగర పర్యటన నేపథ్యంలో పెద్ద దర్గా, విమా నాశ్రయం వద్ద కలెక్టర్‌ వి. విజయరామరాజుతో కలిసి చేపట్టాల్సిన ముందస్తు భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలపై పోలీసు అధికారులు, సిబ్బంది కి దిశానిర్దేశం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశి ంచారు. వారి వెంట ఎఆర్‌ అదనపు ఎస్‌పి ఎస్‌ఎస్‌.ఎస్‌.వి కష్ణారావు, కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ యు. వెంకటకుమార్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

➡️