సిఎం మొండి వైఖరి వీడాలి

Jan 5,2024 22:02
ఫొటో : మాట్లాఉతున్న సిఐటియు నాయకులు

ఫొటో : మాట్లాఉతున్న సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య
సిఎం మొండి వైఖరి వీడాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్‌వాడీలు న్యాయమైన డిమాండ్లతో చేపట్టే సమ్మెపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మొండి వైఖరి విడనాడాలని సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల 25వ రోజు సమ్మెలో తమ సమస్యలను పరిష్కరించాలని వారి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటి నాయకులు కాకు వెంకటయ్య పాల్గొని మాట్లాడుతూ న్యాయమైన కోర్కెతో అంగన్‌వాడీలు చేపట్టే సమ్మెలో ఉన్న వారికి అండగా నిలవాల్సింది పోయి నోటీసులు పంపించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిచో అంగన్‌వాడీల విశ్వరూపం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఆగ్రహించిన ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు ప్రమీల, చాంద్‌ బేగం, రమాదేవి, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️