లోక్‌ అదాలత్‌లో 2,190 కేసులు

పరిష్కారంప్రజాశక్తి – కడప జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 2190 కేసులు పరిష్కరించి రూ.7.51 కోట్లను కక్షిదారులకు చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్‌ జి. శ్రీదేవి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ ఎస్‌. బాబా ఫక్రుద్దీన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కడపలో 6, ప్రొద్దుటూరులో 4, రాజంపేటలో1, రాయచోటిలో 4, బద్వేల్‌లో 2, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, మైదుకూరులలో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేశామన్నారు. రాజంపేట మూడవ అదనపు జిల్లా కోర్టుకు సంబంధించిన కేసులు కడప ఆరవ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) బెంచ్‌లో పరిష్కరించినట్లు తెలిపారు. రైల్వే కోడూరు కోర్టుకు సంబంధించిన కేసులు కడప ఎక్సైజ్‌ కోర్టు బెంచ్‌లో పరిష్కరించామని చెప్పారు. రాజంపేట మెజిస్ట్రేట్‌ కోర్టుకు సంబంధించిన, నందలూరు కోర్టుకు సంబంధించిన కేసులు కడప ఫస్ట్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు బెంచ్‌ లో పరిష్కరించినట్లు చెప్పారు. సిద్ధవటం కోర్టుకు సంబంధించిన కేసులు బద్వేలు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు బెంచ్‌లో పరిష్కరించినట్లు తెలిపారు. జాతీయ లోక్‌ అదాలత్‌ లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా వారు కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్‌. వెంకటేశ్వరరావు, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దినబాబు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి షేక్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కే.ప్రత్యూష కుమారి, ఎక్సైజ్‌ కోర్టు జడ్జ్‌ జె.హేమ స్రవంతి, ఒకటవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.నందిని, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.భార్గవి, కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప నాయుడు, న్యాయవాదులు, ప్రజలు, కక్షిదారులు పాల్గొన్నారు.

➡️