8 నాటు తుపాకులు అప్పగింత

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : మండలంలోని జడ్డంగి రాజువొమ్మంగి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో ఏడుగురు వ్యక్తులు ఎనిమిది నాటు తుపాకులను సోమవారం అప్పగించినట్లు రాజవొమ్మంగి సీఐ ఎన్‌ సన్యాసినాయుడు తెలిపారు. కిండ్ర గ్రామం నుండి 2 నాటుతుపాకులు, జడ్డంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాతంగి, ఓకుర్తి గ్రామాల నుండి 6 నాటు తుపాకులను స్వచ్చందంగా పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. మండలంలో ఎవరైనా నాటుతుపాకులు, లైసెన్స్‌ లేని తుపాకులను స్వచ్చందగా డిపాజిట్‌ చేయాలని లేకుంటే అటువంటి వారిపై భారతీయ ఆయుధాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు ఎస్‌ వెంకయ్య, రఘునాధరావు పాల్గొన్నారు.

➡️